Advertisement

  • అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు ఇవే ..స్కూల్స్ అప్పటివరకు బంద్

అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు ఇవే ..స్కూల్స్ అప్పటివరకు బంద్

By: Sankar Sat, 29 Aug 2020 8:49 PM

అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు ఇవే ..స్కూల్స్ అప్పటివరకు బంద్


కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాన్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో పలు కీలక రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు కల్పించింది.

కేంద్రం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. సెప్టెంబర్‌ 7 నుంచి దేశ వ్యాప్తంగా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. దశల వారిగా మెట్రో సేవల ప్రారంభానికి కేంద్రం అనుమతినిచ్చింది. అలాగే సెప్టెంబర్‌ 30 వరకు పాఠశాలు, మాల్స్‌ తెరవకూడదని కేంద్రం పేర్కొంది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం మరికొన్నాళ్ల పాటు కొనసాగిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొంది.

అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు:

సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి

సెప్టెంబర్‌ 30 వరకు స్కూళ్లు, మాల్స్‌ బంద్‌

సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ బంద్‌

100 మందికి మించకుండా స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజకీయ సమావేశాలకు అనుమతి

సభలు నిర్వహించే సమయంలో భౌతికదూరం, మాస్క్‌, శానిటైజర్‌ తప్పనిసరి

సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి

అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలను తొలగింపు

అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు

చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలన్న కేంద్రం

అత్యవసరమైతేనే బయటకు రావాలి

సెప్టెంబర్‌ 30 వరకు కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు

Tags :

Advertisement