Advertisement

  • ఇంటర్ సిలబస్ తగ్గింపుకు పచ్చజెండా ఊపిన తెలంగాణ ప్రభుత్వం..

ఇంటర్ సిలబస్ తగ్గింపుకు పచ్చజెండా ఊపిన తెలంగాణ ప్రభుత్వం..

By: Sankar Mon, 21 Sept 2020 12:10 PM

ఇంటర్ సిలబస్ తగ్గింపుకు పచ్చజెండా ఊపిన తెలంగాణ ప్రభుత్వం..


కరోనా వైరస్ ఈ విద్యాసంవత్సరంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. మహమ్మారి కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది.. ఇవాళ్టి నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీలు ప్రారంభమైనా.. విద్యార్థులు పక్కాగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాల్సిన అవసరంలేదు..

ఆన్‌లైన్‌ క్లాసులు కూడా వినే వెసులుబాటు ఉంది. మరోవైపు.. విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభంకావడంతో.. ఇంటర్‌ సిలబస్‌ను 30 శాతం తగ్గించింది తెలంగాణ ఇంటర్ బోర్డు.. ఇక, సిలబస్‌ తగ్గించుకునేందుకు ఇంటర్‌ బోర్డుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సైన్స్ సబ్జెక్టుల్లో సీబీఎస్‌ఈ ఏ పాఠ్యాంశాలు తొలగించిందో అవే పాఠ్యాంశాలను తొలగించాలని ఇంటర్ బోర్డు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది..

హ్యూమనిటీస్‌లో సీబీఎస్‌ఈ తొలగించిన వివాదాస్పద పాఠ్యాంశాల జోలికి పోకుండా.. సబ్జెక్టు నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పాఠ్యాంశాలు తొలగించినట్టుగా సమాచారం.. దీనిపై ఈ రోజు అధికారికంగా ప్రకటన చేయనుంది తెలంగాణ ఇంటర్ బోర్డు.

Tags :

Advertisement