Advertisement

  • తొమ్మిది హత్యలతో సంచలనం రేపిన సంజయ్ కుమార్ కు ఉరిశిక్ష...

తొమ్మిది హత్యలతో సంచలనం రేపిన సంజయ్ కుమార్ కు ఉరిశిక్ష...

By: Sankar Wed, 28 Oct 2020 4:10 PM

తొమ్మిది హత్యలతో సంచలనం రేపిన సంజయ్ కుమార్ కు ఉరిశిక్ష...


తెలుగు రాష్ట్రల్లో సంచలనం రేపిన గీసుకొండ మండలం గొర్రెకుంటలో జరిగిన తొమ్మిది హత్యలకు కారకుడైన సంజయ్ కుమార్ కి వరంగల్ న్యాయస్థానం లో ఉరి శిక్ష ఖరారు చేశారు. ఒక్క హత్యను కప్పి పుచ్చుకునేందుకు మరో 9మందిని హత్యలకు కారకుడైన మృగానికి ఉరి శిక్ష తీర్పు వెలువడింది.

కేసు నమోదైనప్పటి నుంచి కేవలం ఐదు నెలల వారం రోజుల్లో శిక్ష పడేవిధంగా గీసుకొండ సీఐ శివరామయ్య సాక్షాలు సేకరించి తన చతురతని ప్రదర్శించారు. 25 రోజుల్లోనే కోర్డులో నేరారోపణ పత్రము దాఖలు చేశారు. కరోనా వల్ల అవాంతరాలు ఏర్పడినప్పటికీ ఒక నెల రోజుల్లోనే విచారణ పూర్తి చేసిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు.. తీర్పును వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష పడటం పట్ల వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. విచారణ త్వరగా పూర్తి చేసినందుకు పోలీసులను అభినందించారు. కాగా, కోర్టు తీర్పు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

మే 21న గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో భాగంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు సంజయ్‌ వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేసి బావిలో పడేశాడు. తొలుత చేసిన మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ మరో తొమ్మిది మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Tags :

Advertisement