Advertisement

  • ఆండ్రాయిడ్ 11 స్మార్ట్ ఫీచర్స్‌ని వెల్లడించిన గూగుల్

ఆండ్రాయిడ్ 11 స్మార్ట్ ఫీచర్స్‌ని వెల్లడించిన గూగుల్

By: chandrasekar Fri, 10 July 2020 10:51 AM

ఆండ్రాయిడ్ 11 స్మార్ట్ ఫీచర్స్‌ని వెల్లడించిన గూగుల్


గూగుల్ ఆండ్రాయిడ్‌ యూజర్స్‌కు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంను అప్‌డేట్ చేస్తూ కొత్తగా రానున్న ఆండ్రాయిడ్ 11 విడుదల తేదీతో పాటు ఆండ్రాయిడ్ 11 ఫీచర్స్‌ని తాజాగా గూగుల్ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 8న ఆండ్రాయిడ్ 11ను విడుదల చేయనున్నట్టు గూగుల్‌ స్మార్ట్‌హోమ్‌ డివిజన్‌ సీనియర్‌ డైరెక్టర్‌ మిచెల్‌ టర్నర్‌ వివరించారు.

అమెరికాలో జరిగిన 'హే గూగుల్' స్మార్ట్ హోమ్ సమ్మిట్‌ వేదికపై మిచెల్ టర్నర్ ఈ వివరాలు వెల్లడించారు. ఆండ్రాయిడ్ 11 ఫీచర్స్‌లో పీపుల్, కంట్రోల్స్, ప్రైవసీ, ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌కు నోటిఫికేషన్స్, స్క్రీన్ రికార్డింగ్, వీడియోలను రికార్డ్ చేసేటప్పుడు నోటిఫికేషన్ సౌండ్‌ని మ్యూట్ చేయడం వంటి అంశాలపై దృష్టి సారించినట్టు గూగుల్ ప్రకటించింది. అన్నింటికి మించి సైబర్ సెక్యురిటీకి అధిక ప్రాధాన్యతనిస్తూ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు గూగుల్ స్పష్టంచేసింది.

ఆండ్రాయిడ్ 11 అందుబాటులోకి వస్తే స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎక్స్‌పీరియన్స్ మరింత ఆహ్లాదకరంగా ఉండనున్నట్టు ఆండ్రాయిడ్‌ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ డేవ్ బర్క్ తెలిపారు. ఇప్పటికే ఈ ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌కి సంబంధించి గత నెలలో బీటా 1 విడుదల చేయగా తాజాగా ఆండ్రాయిడ్ బీటా 2 కూడా వచ్చేసింది. ఆండ్రాయిడ్ 11 టెస్టింగ్‌లో భాగంగానే ఈ బీటా వెర్షన్స్ విడుదలయ్యాయి.

Tags :
|

Advertisement