Advertisement

  • వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని కొనసాగించిన గూగుల్ సంస్థ

వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని కొనసాగించిన గూగుల్ సంస్థ

By: chandrasekar Tue, 28 July 2020 1:45 PM

వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని కొనసాగించిన గూగుల్ సంస్థ


గూగుల్ సంస్థ తమ సిబ్బందికి శుభవార్త చెప్పింది. కరోనావైరస్ వ్యాప్తి నివారణకు సోషల్ డిస్టన్సెంగ్ కీలకం కావడంతో ప్రస్తుతం వారికి ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని వచ్చే ఏడాది జూన్ చివరి వరకు పొడిగిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. సంస్థ సిబ్బందికి ఓ లేఖ రాసిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆఫీసుకు రావాల్సిన అవసరం లేకుండా పనిచేసుకునే సౌలభ్యం ఉన్న వాళ్లకు వాల్యుంటరీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.

తొలుత ఈ ఏడాది చివరి వరకే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పిన గూగుల్. ఇప్పుడిలా నిర్ణయం తీసుకుందంటే, కరోనావైరస్ సంక్షోభం ఇప్పుడప్పుడే ముగిసేది కాదనే ఉద్దేశమే అందుకు కారణమై ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ కొనసాగింపు విషయంలో మిగతా వ్యాపార సంస్థలు కూడా గూగుల్ దారిలోనే నడుస్తాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Tags :
|

Advertisement