Advertisement

  • ఈ విటమిన్ లోపం ఉన్నవాళ్ళకి కరోనా రిస్క్ ఎక్కువ..

ఈ విటమిన్ లోపం ఉన్నవాళ్ళకి కరోనా రిస్క్ ఎక్కువ..

By: Sankar Mon, 07 Sept 2020 5:55 PM

ఈ విటమిన్ లోపం ఉన్నవాళ్ళకి కరోనా రిస్క్ ఎక్కువ..


శరీర ఆరోగ్యానికి విటమిన్లకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఎవరి శరీరంలో విటమిన్లు తక్కువగా ఉంటాయో వారు అనారోగ్యం బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుంది.

ఏ విటమిన్ లోపం అధికంగా ఉంటె దానికి సంబంధించిన అనారోగ్యం బారినపడే అవకాశం ఉంటుంది. శరీరంలో విటమిన్ డి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విటమిన్ తక్కువగా ఉంటె కరోనా సోకే ప్రమాదం మిగతా వారితో పోలిస్తే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ డి లోపం వలన ఎముకలు పెళుసుగా మారతాయి. బరువుపెరుగుతారు. డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోజు ఉదయాన్నే సూర్యరశ్మిలో కాసేపు నిలబడాలి. అదే విధంగా విటమిన్ డి లభించే ఆహార పదార్ధాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా సముద్ర చేపలు, బ్రకోలి, బొప్పాయి, క్యారెట్, అవకాడో వంటివి తీసుకోవాలి.

Tags :
|
|
|

Advertisement