Advertisement

  • గుడ్ న్యూస్ : కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ తీసుకున్నవారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ..

గుడ్ న్యూస్ : కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ తీసుకున్నవారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ..

By: Sankar Tue, 01 Sept 2020 2:51 PM

గుడ్ న్యూస్ : కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ తీసుకున్నవారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ..


దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కేసుల వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. ఈ నేపథ్యంలో ప్రజలంతా వ్యాక్సిన్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఈ తరుణంలో భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ లు సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 'కోవాగ్జిన్' పూర్తిగా సురక్షితమన్న శుభవార్త తెలిసింది. పూర్తి దేశీ పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ వ్యాక్సిన్ తొలి దశ ట్రయల్స్ ముగిశాయని, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లూ కనిపించలేదని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇండియా లో మొత్తం మూడు వ్యాక్సిన్ లు ట్రయల్స్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.

వాటిల్లో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తో పాటు ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ ముందున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్ లు ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ లో ఉన్నాయి. మరోవైపు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పై దేశంలోని పలు ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ట్రయల్స్ నిర్వహించిన అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఇక నిన్న మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ డిసెంబర్ లోగా వ్యాక్సిన్ విడుదలవుతుందని వెల్లడించారు.

Tags :
|

Advertisement