Advertisement

  • A P నిరుద్యోగులకు గుడ్ న్యూస్: త్వరలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

A P నిరుద్యోగులకు గుడ్ న్యూస్: త్వరలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

By: Dimple Fri, 17 July 2020 10:14 AM

A P నిరుద్యోగులకు గుడ్ న్యూస్: త్వరలో ఉద్యోగాలకు నోటిఫికేషన్


నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలోనిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలో 10వేలకు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అందులో 9,712 ఉద్యోగాలు వైద్య ఆరోగ్య శాఖలోనే ఉండటం విశేషం.

ఈ ఉద్యోగాల్లో వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సులతో పాటు మిగిలిన వైద్య సిబ్బంది ఉండనున్నారు. ఈ 9,712 పోస్టుల్లో 5,701 కొత్త ఉద్యోగాలు, మిగిలినవి 4,011 ఖాళీగా ఉన్న స్థానాలు. నిన్న జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇంకా..

· ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ(గుంటూరు) హోం సైన్స్ విభాగంలో 2 ఫ్రొపెసర్‌, 4 అసోసియేటివ్‌ ప్రొఫెసర్‌ పోస్టులు
· వైఎస్సార్ జిల్లాలోని వైఎస్సార్ హార్టికల్చర్‌ యూనివర్సిటీ కింద అరటి పరిశోధన సంస్థకు 11 పోస్టులు (5 టీచింగ్‌, 6 నాన్ టీచింగ్ పోస్టులు)
· సీఐడీ విభాగంలో 10 జూనియర్ అసిస్టెంట్‌లు, 10 స్టెనో పోస్టులు
· ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 210 టీచింగ్, 89 నాన్ టీచింగ్ పోస్టులు
· శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 201 టీచింగ్‌, 89 నాన్ టీచింగ్ పోస్టులు
· స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్‌ కమిషన్‌లో 28 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌
పడింది.

Tags :
|

Advertisement