Advertisement

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన యూపీ సర్కార్

By: Sankar Fri, 18 Sept 2020 6:06 PM

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన యూపీ సర్కార్


కరోనా కారణంగా దేశం మొత్తం నిరుద్యోగ సమస్యతో అల్లాడుతోంది..అయితే యూపీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పింది.. రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు.

6 నెలల్లో ఉద్యోగాలు పొందిన వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ ఇవ్వాలని పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో యోగి ఆధిత్యనాథ్‌ ఉద్యోగ నియామకాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ నియామకాలలో ఎలాంటి అవినీతికి అవకాశం ఇవ్వొద్దని పారదర్శకంగా పరీక్షలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఆరు నెలల్లో 3 లక్షల ఉద్యోగ నియామాకాలు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ అంశంపై త్వరలో యూపీఎస్‌సీ(ఉత్తర్‌ ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌) నియామక సంస్థలతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమావేశం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు యూపీ ప్రభుత్వం లక్షా 37వేల పోలీస్‌ నియామకాలు, 50 వేల టీచర్‌ ఉద్యోగాలు, ప్రభుత్వ శాఖలలో లక్షకు పైగా నియామకాలను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే యూపీ ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో విఫలమయిందని ప్రతిపక్ష పార్టీలు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ), కాంగ్రెస్ విమర్శిస్తున్నాయి.

Tags :

Advertisement