Advertisement

  • శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఎందుకో తెలుసా...?

శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఎందుకో తెలుసా...?

By: Anji Sat, 19 Dec 2020 9:12 PM

శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఎందుకో తెలుసా...?

కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా ఈ ఏడాది భక్తులు లేక బోసిపోయింది. నవంబర్ 16 వ తేదీ నుంచి సామాన్య భక్తులను అనుమతిస్తున్నారు.

వారాంతంలో రెండవ వేలమందికి, వారం మధ్య రోజుల్లో వెయ్యి మందిని అనుమతించారు. ఆ తరువాత ఆ సంఖ్యను పెంచి మామూలు రోజుల్లో రెండు వేలమందికి, వారాంతాల్లో మూడు వేల మందికి అనుమతి ఇచ్చారు.
కాగా, ఈ సంఖ్యను పెంచుతూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రోజుకు 5 వేలమంది భక్తులకు దర్శనం అవకాశం ఇవ్వాలని ట్రావెన్ కొర్ ట్రస్ట్‌ను ఆదేశించింది. డిసెంబర్ 26 వ తేదీన మండలం పూజను నిర్వహిస్తారు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
మండలం పూజ తరువాత జనవరి 14 న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఆ సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే, మండలం పూజ తరువాత యాత్రికులతో పాటుగా, సిబ్బంది కూడా తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

Tags :

Advertisement