Advertisement

తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్...!

By: Anji Thu, 29 Oct 2020 6:51 PM

తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్...!

ఎంసెట్‌ 2020లో 45 శాతం ఇంటర్ మార్కుల వెయిటేజ్ నిబంధనను తొలిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎంసెట్‌కు అర్హత సాధించాలంటే ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు రావాల్సి ఉంది.

అంతేకాదు ఒకవేళ ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాసి ఎంసెట్‌కు అర్హత సాధించాలి. కరోనా వైరస్ కారణంగా సప్లిమెంటరీ పరీక్షలు రద్దు కావడం.. ఎగ్జామ్స్ లేకుండానే 35 మార్కులతో విద్యార్ధులు అందరూ పాస్ కావడం జరిగింది.

దీనితో చాలామంది ఎంసెట్‌కు దూరమయ్యారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్‌ను ఎత్తివేసింది. దీనితో, ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులందరూ ఎంసెట్ కౌన్సిలింగ్‌కు హాజరు కావచ్చు.

Tags :

Advertisement