Advertisement

EPFO పెన్షనర్లకు శుభవార్త...

By: chandrasekar Tue, 24 Nov 2020 5:32 PM

EPFO పెన్షనర్లకు శుభవార్త...


ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతుంది. అయితే పెన్షన్ పొందాలంటే పింఛన్‌దారులు నవంబరు లోపు లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. తాము జీవించి ఉన్నట్లు చందాదారులు సర్టిఫికెట్‌ను సమర్పిస్తేనే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రతీ నెలా ఈపీఎఫ్ఓ పింఛన్‌ను మంజూరు చేస్తుంది.

అయితే కరోనావైరస్ నేపథ్యంలో అంతకుముందు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును నవంబరు 1 నుంచి 2020 డిసెంబరు 31 వరకు గడువును పెంచిన ప్రభుత్వం తాజాగా మరోసారి గడవును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది (2021) ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్ గడువును పెంచుతూ సెంట్రల్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో వయసు మీద పడిన ఫించన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లడం చాలా కష్టంగా మారింది. దీంతో పింఛన్‌దారులు గడువును మరికొంతకాలం పెంచాలంటూ పెన్షన్ మంత్రిత్వ శాఖకు వినతి పత్రాలను సమర్పించారు. వాటిని పరిగణలోకి తీసుకున్న మంత్రిత్వ శాక కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఆఫిస్‌లో సంప్రదించిన అనంతరం గడువు తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెన్షన్ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంతో ఫిబ్రవరి వరకు పింఛన్‌దారులకు యథావిధిగా పింఛన్ అందనుంది.

Tags :
|
|

Advertisement