Advertisement

  • అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరిమల దేవాలయం

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరిమల దేవాలయం

By: Sankar Thu, 03 Dec 2020 11:30 AM

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరిమల దేవాలయం


అయ్యప్ప భక్తుల శబరిమల యాత్రపై కరోనా ప్రభావం పడింది. కరోనా కారణంగా గతంలో మాదిరిగా ఎక్కువ మంది భక్తులను అనుమతించడం లేదు. అంతేకాదు, దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

మాస్క్, భౌతికదూరం తప్పనిసరి. దర్శనానికి సంబంధించి ముందుగానే పోర్టల్ లో బుక్ చేసుకోవాలి. పోర్టల్ ద్వారా అనుమతి వచ్చిన వ్యక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది. ఇప్పటి వరకు రోజుకు వెయ్యి మందికి మాత్రమే అనుమతి ఉండేది. వారాంతాల్లో రోజుకు 2వేలమందికి అనుమతి ఇచ్చారు.

అయితే, ఈ సంఖ్యను ఇప్పుడు పెంచుతూ కేరళ దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది. రోజుకు వెయ్యి నుంచి 2వేలమందికి అనుమతి ఇచ్చింది. ఇక వారాంతాల్లో 3వేలమందికి అనుమతి ఇస్తున్నట్టు దేవాదాయశాఖ మంత్రి సురేంద్రన్ స్పష్టం చేశారు. అయితే, నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని మంత్రి తెలిపారు

Tags :

Advertisement