Advertisement

వృద్ధురాలికి చేప రూపంలో అదృష్టం

By: chandrasekar Fri, 02 Oct 2020 6:06 PM

వృద్ధురాలికి చేప రూపంలో అదృష్టం


పేదరికంలో మగ్గుతున్న ఓ వృద్ధురాలు కి చేప కారణంగా రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యింది. చేప రూపంలో కష్టాలు తీరడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పశ్చిమ బెంగాల్‌‌ సాగర్‌ ద్వీపం చక్పుల్ధుబి గ్రామంలో పుష్పాకర్‌ అనే వృద్ధురాలికి నదిలో 52కిలోల అతిపెద్ద చేప పట్టుబడింది. దీంతో ఆ చేపను పుష్పాకర్ రూ. 3 లక్షలకు అమ్మింది.

స్ధానిక మార్కెట్‌లో ఆ చేప కిలోకు 6,200 రూపాయలు చొప్పున ధర పలకడంతో వృద్ధురాలు కష్టం ఫలించినట్లయింది. అయితే ఈ చేపను హోల్‌సేల్‌ మార్కెట్‌లో​ రూ. 3 లక్షలకుపైగా విక్రయించానని ఇది తనకు జాక్‌పాట్ లాగా మారిందని పుష్పకర్ ఆనందం వ్యక్తంచేసింది. ఇంత పెద్ద చేపను తాను ఎప్పుడూ చూడలేదని, బెంగాలీలో ఈ చేపను భోలా ఫిష్‌ అంటారని ఆమె పేర్కొంది.

నది నుంచి ఈ భారీ చేపను గ్రామంలోనికి తీసుకురావడానికి వృద్ధురాలు పుష్పాకర్ చాలా కష్టపడిందని గ్రామస్థులు తెలిపారు. అయితే ఆ భారీ చేపను చుట్టుపక్కలున్న ప్రజల సాయంతో ఫిష్‌ మార్కెట్‌కు తీసుకొచ్చిందని తెలిపారు. ఓడ ఢీ కొనడంతోనే ఈ చేప చనిపోయి ఉంటుందని ఓ గ్రామస్థుడు తెలిపారు. అయితే ఈ చేపను విదేశాలకు తరలిస్తారని గ్రామస్థులు తెలిపారు. చేప చనిపోకుండా ఉండినట్లయితే ఎక్కువ ధర పలికేదని ఇది ఎక్కువగా ఆగ్నేయాసియాలోని దేశాలకు ఎగుమతి అవుతుందని వ్యాపారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ బామ్మ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అదృష్టం అంటే బామ్మదే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Advertisement