Advertisement

దీపావళి పరుగు మొదలు పెట్టిన బంగారం...!

By: Anji Fri, 06 Nov 2020 10:16 PM

దీపావళి పరుగు మొదలు పెట్టిన బంగారం...!

దేశీయ మార్కెట్‌లో పసిడి దీపావళి పరుగు మొదలు పెట్టింది. సామాన్యులకు దొరక్కుండా తప్పించకుపోతోంది. రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. శుభకార్యాలు ప్రరంభం కావడంతో బంగారంకు మరింత డిమాండ్ ఏర్పడింది.

దేశీయంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.791 పెరిగి రూ.51,717కు చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో రూ.50,926 వద్ద ముగిసింది.

ఇక వెండి సైతం ఢిల్లీలో కేజీ రూ.2,147 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ.64,578కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడమే పసిడి ధరలు వరుసగా మూడో రోజూ పెరగడానికి కారణమని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1950 డాలర్లు ఉండగా.. వెండి ఔన్సు ధర 25.44 డాలర్లు పలుకుతోంది. అమెరికా ఎన్నికల్లో జో బైడెన్‌ గెలుపు దాదాపు ఖరారైన నేపథ్యంలో త్వరలోనే మరో ఉద్దీపన ప్యాకేజీ వస్తుందని విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.

అదే జరిగితే ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు, డాలరు విలువ క్షీణించే అవకాశం ఉండడంతో స్టాక్ హోలర్డర్లు పెట్టుబడికి బంగారంవైపు మొగ్గు చూపుతున్నారు.

దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా నియంత్రణకు మరోసారి లాక్‌డౌన్‌లు విధిస్తుండడంతో మార్కెట్లలో పెట్టుబడి అంత సురక్షితం కాదని భావిస్తుండడం బంగారానికి డిమాండ్‌ ఏర్పడింది.

Tags :

Advertisement