Advertisement

సోమవారం మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

By: chandrasekar Tue, 15 Sept 2020 09:18 AM

సోమవారం మళ్ళీ పెరిగిన బంగారం ధరలు


ఊహకందని రీతిలో పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజుల్లో కనీసంగా తగ్గు ముఖం పట్టాయి. కానీ మళ్ళీ ఊపందుకుని స్వల్పంగా సోమవారం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ సోమవారం బంగారం ధరలు భారమయ్యాయి. డాలర్‌ బలహీనపడటంతో పసిడికి మదుపరుల నుంచి డిమాండ్‌ పెరిగింది.

ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 101 రూపాయలు పెరిగి 51,420 రూపాయలు పలికింది. వెండి కిలో 247 రూపాయలు ఎక్కువై 68,175 రూపాయలకు ఎగబాకింది. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్ల పతనం కూడా పసిడికి కలిసివచ్చింది. ఇక అమెరికన్‌ కరెన్సీ డాలర్‌ బలహీనపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర ఔన్స్‌కు 1960.50 డాలర్లకు పెరిగింది.

వడ్డీరేట్లపై బుధవారం జరిగే ఫెడరల్‌ రిజర్వ్‌ విధాన భేటీలో వెలువడే నిర్ణయం పసిడి ధరలను ప్రభావితం చేస్తుందని బులియన్‌ నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్ ధరలు తగ్గినా పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

Tags :
|
|
|
|

Advertisement