Advertisement

మళ్లీ దిగి వచ్చిన బంగారం ధరలు

By: chandrasekar Fri, 27 Nov 2020 11:26 AM

మళ్లీ దిగి వచ్చిన బంగారం ధరలు


బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు మరోసారి పతనమయ్యాయి. బంగారం ధర రూ.50 వేల దిగువకు పడిపోయింది. పసిడికి భిన్నంగా వెండి ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు దిగొచ్చాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు రూ.650 మేర దిగొచ్చాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,990 అయింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.600 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.47,660కి క్షీణించింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌‌లలో బంగారం ధర రూ.650 మేర దిగొచ్చింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,760 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ.45,610కి దిగొచ్చింది.

బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా వెండి ధరలు పతనమవుతున్నాయి. అయితే తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ.50 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.60,050 అయింది. దేశ వ్యాప్తంగా కేజీ వెండి ఇదే ధరలో మార్కెట్ అవుతోంది.

Tags :
|
|
|

Advertisement