Advertisement

రెండోరోజూ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...

By: chandrasekar Fri, 30 Oct 2020 2:03 PM

రెండోరోజూ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...


మళ్ళీ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు మాత్రం యథాతథంగా కొసాగుతున్నాయి. తాజాగా వెండి ధర ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,400గా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో తాజాగా బంగారం ధర రూ.340 మేర స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,720కి పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.320 తగ్గడంతో ధర రూ.47,410 అయింది.

బంగారం ధరలు ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా రెండోరోజూ దిగొచ్చాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.440 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.52,560కి దిగొచ్చింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.400 మేర తగ్గి 10 గ్రాముల ధర రూ.49,100 వద్ద ట్రేడ్ అవుతోంది. గత వారం రోజులుగా బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన వెండి ధరలు అదే విధంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో తాజాగా వెండి ధరలో ఏ మార్పులేదు. ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,400గా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా వెండి ఒకే ధరలో మార్కెట్ అవుతోంది.

Tags :
|
|

Advertisement