Advertisement

భారీగా పడిపోయిన బంగారం ధరలు ..,

By: chandrasekar Thu, 01 Oct 2020 12:12 PM

భారీగా పడిపోయిన బంగారం ధరలు ..,


బంగారం ధర పడిపోతూనే వస్తోంది. ఆగస్ట్ నెలలో కొత్త గరిష్ట స్థాయిలకు చేరిన బంగారం ధర అక్కడి నుంచి తగ్గుతూనే వస్తోంది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.49,500 వద్ద కదలాడుతోంది. ఆగస్ట్ 7న బంగారం ధర ఏకంగా రూ.56,200 స్థాయికి పరుగులు పెట్టిన విషయం తెలిసిందే.అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కాలంలో బంగారం ధర ఏకంగా 10 శాతం మేర పతనమైంది. ఇటీవల బంగారం ధర ఔన్స్‌ను 2075 డాలర్లకు ఎగసింది. అయితే ఇప్పుడు 1860 డాలర్ల వద్ద కదలాడుతోంది.

ఇటీవల బంగారం ధర ఔన్స్‌ను 2075 డాలర్లకు ఎగసింది. అయితే ఇప్పుడు 1860 డాలర్ల వద్ద కదలాడుతోంది.

గ్లోబల్ మార్కెట్‌లో 2020 ఇప్పటి దాకా చూస్తే బంగారం ధర ఇంకా 20 శాతానికి పైగా పైస్థాయిలోనే ఉంది. తక్కువ వడ్డీ రేట్లు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు బలహీనంగా ఉండటం వంటి అంశాలు బంగారం ధరకు మద్దతునిస్తున్నాయి. అదేసమయంలో ఈక్విటీ మార్కెట్లు పెరుగుతుండటంతో పసిడికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. బంగారం ధరకు 1820 వద్ద బలమైన మద్దతు ఉందని మార్కెట్ వర్గాల పేర్కొంటున్నాయి.

బంగారం ధర మాత్రమే కాకుండా వెండి ధర కూడా ఇదే దారిలో నడుస్తోంది.వెండి ధర ఆగస్ట్ నెలలో కేజీకి ఏకంగా రూ.80,000 స్థాయికి చేరింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వెండి ధర రూ.58,000 వద్ద కదలాడుతోంది.

Tags :
|
|
|

Advertisement