Advertisement

నేడు మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు...

By: chandrasekar Thu, 12 Nov 2020 1:10 PM

నేడు మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు...


బులియన్ మార్కెట్‌లో నిన్న దిగొచ్చిన బంగారం ధరలు నేడు మళ్లీ స్వల్పంగా పుంజుకున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించాయి. తాజాగా బంగారం ధరలు ఢిల్లీలో యథాతథంగా కొనసాగుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌‌లలో బంగారం ధర రూ.110 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,490కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.47,200కు జంప్ అయింది.

గత వారం ఢిల్లీ మార్కెట్‌లోనూ పెరిగిన బంగారం ధరలు నిన్న దిగొచ్చాయి. తాజాగా బంగారం ధరలు ఢిల్లీలో యథాతథంగా కొనసాగుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,610 వద్ద మార్కెట్ అవుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,160గా కొనసాగుతోంది.బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. నిన్న వెండి ధర రూ.3,500 మేర పతనం కాగా, తాజాగా రూ.900 మేర పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,800కి పుంజుకుంది. దేశ వ్యాప్తంగా ఇదే ధరలో మార్కెట్ అవుతోంది.

Tags :
|
|
|

Advertisement