Advertisement

రెండోరోజు దిగొచ్చిన బంగారు, వెండి ధరలు

By: chandrasekar Fri, 11 Dec 2020 1:11 PM

రెండోరోజు దిగొచ్చిన బంగారు, వెండి ధరలు


దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు క్షీణించాయి. మరోవైపు వెండి ధర కేవలం వారం రోజుల వ్యవధిలో రూ.8000 మేర పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం‌లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.430 మేర పతనం కావడంతో 10 గ్రాముల ధర రూ.50,070 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గడంతో 10 గ్రాములకు రూ.45,900కి తగ్గింది. ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధరలు తగ్గాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.770 మేర దిగిరావడంతో 10 గ్రాముల ధర రూ.52,420కి పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర ఏకంగా రూ.1,200 మేర పతనమైంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.66,800 అయింది.

ఢిల్లీ మార్కెట్‌‌లో 22 క్యారెట్ల బంగారంపై రూ700 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,050కి దిగొచ్చింది. గత నెలలో తగ్గిన వెండి ధరలు డిసెంబర్ నెలలో బులియన్ మార్కెట్‌లో పుంజుకుంటున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర రూ.1,000 మేర తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.63,400కి పడిపోయింది.

Tags :
|
|
|

Advertisement