Advertisement

  • రైతులతో మాట్లాడించేందుకు వెళ్తుంటే.. కిడ్నాప్ అని ప్రచారం

రైతులతో మాట్లాడించేందుకు వెళ్తుంటే.. కిడ్నాప్ అని ప్రచారం

By: chandrasekar Tue, 06 Oct 2020 6:03 PM

రైతులతో మాట్లాడించేందుకు వెళ్తుంటే.. కిడ్నాప్ అని ప్రచారం


హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన మొక్క జొన్నల వ్యాపారి నాగభూషణంను తాము కిడ్నాప్ చేశామనడంలో నిజం లేదని రైతులు, స్థానిక మొక్కజొన్న వ్యాపారి రాజ భూషణం స్పష్టం చేశారు.

కరోనా లాక్డౌన్ కంటే ముందు రైతుల నుంచి తీసుకున్న మొక్కజొన్న పంటకు సంబంధించిన 2 కోట్ల 30 లక్షల రూపాయలు నాగభూషణం చెల్లించాల్సి ఉందని రాజభూషణం చెప్పారు. అయితే ఈ మొత్తాన్ని ఇవ్వకుండా నాగభూషణం తప్పించుకు తిరుగుతున్నాడని తాను మధ్యవర్తిగా ఉండి నాగభూషణంకు మొక్కజొన్న పంట అమ్మించానని రాజా భూషణం వివరించారు.

డబ్బుల కోసం నన్ను రైతులు ఒత్తిడి చేస్తూ ఇబ్బంది పెట్టడంతో డబ్బులు చెల్లించాల్సిన నాగభూషణంను రైతుల వద్దకు పిలుచుకు వెళ్లేందుకు ప్రయత్నించామే తప్ప కిడ్నాప్ చేయలేదన్నారు.

తమకు డబ్బు ఇవ్వాల్సిన నాగభూషణంతోనే నేరుగా రైతులతో మాట్లాడించేందుకు అతన్ని కోరుట్లకు తీసుకు వస్తుంటే నాగభూషణం తనను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడని వివరించారు.

Tags :
|
|

Advertisement