Advertisement

  • ప్రయాణికులకు సరికొత్త స్కీంను ఆఫర్ ప్రవేశ పెట్టిన గోఎయిర్

ప్రయాణికులకు సరికొత్త స్కీంను ఆఫర్ ప్రవేశ పెట్టిన గోఎయిర్

By: chandrasekar Sat, 25 July 2020 3:29 PM

ప్రయాణికులకు సరికొత్త స్కీంను  ఆఫర్ ప్రవేశ పెట్టిన గోఎయిర్


గోఫ్లైప్రయివేట్ తో తమ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణీకులకు ప్రయివేట్ జోన్ ట్రావెలింగ్ వెసులుబాటును అందిస్తున్నది. దీని కోసం ప్రయాణీకులు ఒకే పీఎన్ ఆర్ పైన మల్టిపుల్ వరుసల్లో సీట్లను బుక్ చేసుకోవచ్చు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం తప్పనిసరి కావడంతో గో ఎయిర్ ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణీకులకు ఇబ్బందిగా అనిపిస్తే వారు సొంతగా ప్రయివేట్ జోన్ క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఇస్తున్నది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణీకులు బహుళ వరుసలు బుక్ చేసుకునేందుకు 'గోఫ్లై‌ప్రయివేట్'ను ప్రవేశ పెట్టింది. తద్వారా వారు ప్రయివేటు జోన్ క్రియేట్ చేసుకోవచ్చు. సురక్షిత ప్రయాణ ధీమాను కల్పించేందుకు ఈ సరికొత్త స్కీంను ప్రవేశ పెట్టింది. కరోనా వ్యాప్తిని నిరోధించే ఉద్దేశ్యంలో భాగంగా విమానయాన సంస్థలు మిడిల్ సీట్ వదిలి పెట్టడం, పక్కసీటుతో కలిపి డిస్కౌంట్‌కు ఇవ్వడం వంటి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ వైరస్ కారణంగా విమానయాన రంగంపై భారీ ప్రభావం పడింది. ఈ మేరకు గోఎయిర్ మేనేజింగ్ డైరెక్టర్ జే-వాడియా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పథకం తీసుకు వచ్చిన మొదటి ఎయిర్ లైన్స్ తమదేనని, ఇందుకు తాము కొంత భరిస్తామని, అలాగే కస్టమర్ ప్రైవసీ ఉంటుందని, ప్రయివేట్ చార్టర్ అనుభూతిని కస్టమర్‌కు అందిస్తుందన్నారు. దేశీయ విమానాల కోసం ఈ సర్వీస్‌లు ప్రారంభించారు. ఈ తరహా సేవలకు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుందని జె-వాడియా తెలిపారు.

Tags :
|
|
|

Advertisement