Advertisement

  • స్తంభించిన జి మెయిల్..తీవ్ర ఇబ్బంది పడిన ఉద్యోగులు

స్తంభించిన జి మెయిల్..తీవ్ర ఇబ్బంది పడిన ఉద్యోగులు

By: Sankar Thu, 20 Aug 2020 5:25 PM

స్తంభించిన జి మెయిల్..తీవ్ర ఇబ్బంది పడిన ఉద్యోగులు


గూగుల్ సేవలు స్తంభించి పోవడంతో ప్రపంచ దేశాల్లోని గూగుల్ యూజర్లు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగుల ఆఫీస్ వర్క్ కు ఆటంకం కలిగింది. ఒకరోజులో పదుల సంఖ్యలో ఫైళ్లను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు జీమెయిల్ అటాచ్‌మెంట్ సర్వీస్ గానీ, గూగుల్ డ్రైవ్ ఫైల్ అప్‌లోడ్ సర్వీస్ గానీ ఉపయోగిస్తుంటారు.

కానీ గురువారం రోజున ఈ రెండు సర్వీస్‌లూ స్తంభించిపోయాయి. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో సోషల్ మీడియా వేదికగా జీమెయిల్ గురించి యూజర్లందరూ ఫిర్యాదులు చేశారు. అధికారిక జీమెయిల్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టులు చేశారు.

దీంతో జీమెయిల్ సర్వీస్‌లో కొంత అసౌకర్యం ఏర్పడిందని గూగుల్ అంగీకరించింది. సమస్యను గురువారం సాయంత్రంలోగా పరిష్కారిస్తామని హామీ ఇచ్చింది. ప్రపంచమంతటా కాకుండా భారతదేశం, యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ దేశాల్లో మాత్రమే ఈ సర్వీస్ స్తంభించిపోయినట్లు విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ సేవలకి అంతరాయం ఏర్పడింది . రెండు నెలల్లో జీమెయిల్ షట్ డౌన్ అవ్వడం ఇది రెండోసారి. జూలై నెలలో కూడా యూజర్లు లాగిన్ అవ్వలేకపోయిన సంగతి తెలిసిందే.

Tags :
|
|

Advertisement