Advertisement

యువతి ప్రాణం తీసిన మొబైల్ లోన్ యాప్‌లు...!

By: Anji Tue, 03 Nov 2020 4:29 PM

యువతి ప్రాణం తీసిన మొబైల్ లోన్ యాప్‌లు...!

విశాఖ గాజువాక సుందరయ్య కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఉరి వేసుకుని అహల్య అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. అహల్య మొబైల్ ఫోన్‌లు పలు లోన్ యాప్‌లు ఉన్నట్లు గుర్తించారు. మొబైల్ యాప్‌ల ద్వారా అహల్య చిన్న చిన్న అప్పులు చేసింది.
అహల్య మొబైల్‌లో మొత్తం 8 లోన్ యాప్ లు ఉన్నాయి. అప్పుల గడువు ముగుస్తుండడంతో ఒత్తిడి తట్టుకోలేక ఉరి వేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా సూచించారు. యువత ఈ లోన్‌ యాప్‌లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అధిక వడ్డీ వసూలు చెయ్యడంతో పాటు, సరైన సమయానికి లోన్ తిరిగి చెల్లించకపోతే సదరు వ్యక్తి ఫోన్‌ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవాళ్లందరికీ ఈ యాప్‌ నిర్వాహకులు హెచ్చరికలు చేస్తూ సందేశాలు పంపుతారు. సదరు వ్యక్తి లోన్ ఎగ్గొట్టాడని, డిపాల్టర్ అంటూ పరువుకు భంగం కలిగే విధంగా ఘాటు మెసేజ్‌లు పెడతారు.

Tags :

Advertisement