Advertisement

  • గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ తాత్కాలిక ప్రావిన్షియల్‌ హోదా కల్పించిన పాక్‌.. భారత్ ఖండనం...

గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ తాత్కాలిక ప్రావిన్షియల్‌ హోదా కల్పించిన పాక్‌.. భారత్ ఖండనం...

By: chandrasekar Mon, 02 Nov 2020 3:13 PM

గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ తాత్కాలిక ప్రావిన్షియల్‌ హోదా కల్పించిన పాక్‌.. భారత్ ఖండనం...


గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం తాత్కాలిక ప్రావిన్షియల్‌ హోదా కల్పిస్తున్నట్లు పాకిస్థాన్‌ అధికారికంగా ప్రకటించింది. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ పర్యటనలో భాగంగా పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ ప్రటకన చేశారు. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతానికి వాస్తవానికి స్వయంప్రతిపత్తి హోదా ఉంది. పాక్‌ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ప్రావిన్షియల్‌ ఆర్డినెన్స్‌ల ద్వారా పాలిస్తోంది. గిల్గిత్-బాల్టిస్థాన్ స్థాయిని మార్చాలని పాకిస్థాన్ ప్రభుత్వం కొన్ని నెలల కిందటే నిర్ణయించింది. నాటి నుంచి భారత్ అభ్యంతరం చెబుతూ వస్తోంది. వివాదాస్పద ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేసుకోవాలని పాక్ దేశం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తోంది.

పాకిస్థాన్ తాజా చర్యను భారత్‌ ఖండించింది. అది ముమ్మాటికీ భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించే ప్రయత్నమేనని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ నవంబర్ 1 న వ్యాఖ్యానించారు. చట్టప్రకారం జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌తో పాటు గిల్గిత్‌-బాల్టిస్థాన్‌గా పిలిచే ప్రాంతం మొత్తం భారత్‌లో అంతర్భాగమేనని ఆయన తెలిపారు. చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించిన భూభాగాలపై పాకిస్థాన్‌కు ఎలాంటి అధికారం లేదని భారత్ స్పష్టం చేసింది. ‘7 దశాబ్దాలుగా గిల్గిత్, బాల్టిస్థాన్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల మానవహక్కుల ఉల్లంఘన, దోపిడీ, స్వేచ్ఛను హరిస్తున్న పాకిస్థాన్ ఇలాంటి దురాక్రమణ వల్ల ఆ నిజాలను దాచలేదు. భారత్‌ భూభాగాలపై ఇలాంటి దురాక్రమణలు ఆపేసి, వారి ఆక్రమణలో ఉన్న ప్రాంతాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలి’ అని పాకిస్థాన్‌కు భారత్ అల్టీమేటం జారీ చేసింది.

Tags :
|

Advertisement