Advertisement

  • ఆ ఇద్దరు కీపర్ల పాత్రనే మార్చేశారు ..సంజు శాంసన్

ఆ ఇద్దరు కీపర్ల పాత్రనే మార్చేశారు ..సంజు శాంసన్

By: Sankar Sat, 13 June 2020 3:59 PM

ఆ ఇద్దరు కీపర్ల పాత్రనే మార్చేశారు ..సంజు శాంసన్



క్రికెట్‌లో ఒకప్పుడు వికెట్ కీపర్ పాత్ర చాలా పరిమితంగా ఉండేది. లోయర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి రావడం.. టెయిలెండర్లతో కలిసి కాసేపు ఇన్నింగ్స్‌ని నడిపించడంతోనే సరిపోయేది. ఆ తర్వాత కీపింగ్ షరా మామూలే. కానీ.. ఓ ఇద్దరు వికెట్ కీపర్లు.. తమ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో టాప్- మిడిలార్డర్‌లో సత్తాచాటి.. కీపర్లపై అప్పటి వరకూ ఉన్న దృక్పథాన్నే మార్చేశారని భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ వెల్లడించాడు. ఆ ఇద్దరూ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అని శాంసన్ వివరించాడు.

ప్రపంచంలో ఇప్పుడు చాలా మంది వికెట్ కీపర్లు.. టాప్ బ్యాట్స్‌మెన్‌లుగా కొనసాగుతున్నారు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఓపెనర్‌గా ఆడటం ద్వారా.. కీపర్లు టాప్ ఆర్డర్‌లోనూ ఆడగలరని నిరూపించాడు. ఇక ధోనీ మిడిలార్డర్‌లో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. వారి బాటలో ఇప్పుడు అందరు వికెట్ కీపర్లు టాప్ లేదా మిడిలార్డర్‌లో మంచి బ్యాట్స్‌మెన్‌లుగా కొనసాగుతున్నారు. దాంతో కెప్టెన్‌కి ఒక బ్యాట్స్‌మెన్‌ని తగ్గించుకుని అదనపు బౌలర్‌ని తుది జట్టులోకి తీసుకునే వెసులబాటు కలుగుతోంది’’ అని సంజు శాంసన్ వెల్లడించాడు.


ఇటీవల కాలంలో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్‌గా సత్తాచాటిన ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే..? ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్.. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ని ఆ జట్టు గెలవడంలో బ్యాట్స్‌మెన్‌గా క్రియాశీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్.. ఓపెనర్‌గా ఇప్పటికీ సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. మహేంద్రసింగ్ ధోనీ.. గత ఏడాది జులై నుంచి టీమిండియాకి దూరంగా ఉంటున్నా.. ఇప్పటికీ ధోనీని మించిన ఫినిషర్‌ లేడు. వెస్టిండీస్ వికెట్ కీపర్ షై హోప్.. ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌కి ఇప్పుడు అతనే వెన్నెముక. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్.. సుదీర్ఘకాలంగా ఆ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు.



dhoni,gilchrist,wicket keeper,sanju samson,batsman,cricket ,సంజు శాంసన్ ,  జోస్ బట్లర్, ముష్ఫికర్ రహీమ్,  ఆడమ్ గిల్‌క్రిస్ట్ , మహేంద్రసింగ్ ధోనీ


Tags :
|

Advertisement