Advertisement

  • భారీ వర్షాల కారణంగా నగర వాసులు ఇంట్లో నుంచి బయటకు రావొద్దు అని హెచ్చరికలు జారీ

భారీ వర్షాల కారణంగా నగర వాసులు ఇంట్లో నుంచి బయటకు రావొద్దు అని హెచ్చరికలు జారీ

By: Sankar Thu, 17 Sept 2020 3:08 PM

భారీ వర్షాల కారణంగా నగర వాసులు ఇంట్లో నుంచి బయటకు రావొద్దు అని హెచ్చరికలు జారీ


హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలెవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ హెచ్చరిక చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. రోడ్లపై నిలిచిన నీటిని మోటార్లతో డిజాస్టర్ బృందాలు తొలగిస్తున్నాయని వెల్లడించారు. బుధవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్‌లో భారీ వర్షం పడింది. అమీర్‌పేట్‌, నాంపల్లి, చార్మినార్, సికింద్రాబాద్, బేగంపేట్, నారాయణగూడ, అఫ్జల్‌గంజ్, చాంద్రాయణగుట్ట, ఖైరతాబాద్, కోఠి, బషీర్‌బాగ్, మెహదీపట్నం ప్రాంతాల్లోనూ పెద్ద వాన పడింది. గండిపేట్‌లో అత్యధికంగా 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నగరంలో వర్షాల ధాటికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో సంబంధిత వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

వర్షాల దాటికి హైదరాబాద్ లో రోడ్లు కూడా నెర్రలు వచ్చి కుంగిపోతున్నాయి..దీనితో నగర వాసులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు ..వాటికీ తోడు మాన్ హోల్స్ నోరు తెరుచుకొని ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి, ఎక్కడ కాలు వేస్తే ఎలా ఉంటుందో తెలియక బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు..

Tags :
|
|
|

Advertisement