Advertisement

  • జిహెచ్ఎంసి లో ల‌క్ష గ‌ణేష్ మ‌ట్టి విగ్ర‌హాల‌ను పంపిణీ..కావాల్సిన వారు కార్పొరేటర్లను సంప్రదించగలరు

జిహెచ్ఎంసి లో ల‌క్ష గ‌ణేష్ మ‌ట్టి విగ్ర‌హాల‌ను పంపిణీ..కావాల్సిన వారు కార్పొరేటర్లను సంప్రదించగలరు

By: Sankar Wed, 19 Aug 2020 9:14 PM

జిహెచ్ఎంసి లో ల‌క్ష గ‌ణేష్ మ‌ట్టి విగ్ర‌హాల‌ను పంపిణీ..కావాల్సిన వారు కార్పొరేటర్లను సంప్రదించగలరు


మరొక రెండు రోజుల్లో గణేష్ పండుగ వస్తుంది ..మాములు టైం లో అయితే ఈ పాటికే గణేష్ మండపాలతో ఊరు వాడ సందడి గా ఉండేవి...ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ సందడి మరి ఎక్కువగా ఉండేది..అయితే ఈ సారి కరోనా మహమ్మారి కారణంగా గణేష్ మండపాలకు ప్రభుతం అనుమతి ఇవ్వలేదు..ఎవరి ఇంట్లో వారే చేసుకోవాలని సూచించింది..

అయితే వినాయ‌క చ‌వితి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కొర్పొరేష‌న్ ప‌రిధిలో ల‌క్ష గ‌ణేష్ మ‌ట్టి విగ్ర‌హాల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ ఈ ప్ర‌తిమ‌ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. సంతోష్ న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మున్సిప‌ల్ కార్పొరేట‌ర్ల‌కు మంత్రి బుధ‌వారం మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను పంపిణీ చేశారు.

అనంత‌రం మాట్లాడుతూ... ఔత్సాహిక ప్ర‌జ‌లు వారి వారి కార్పొరేట‌ర్ల‌ను సంప్ర‌దించి ఈ విగ్ర‌హాల‌ను తీసుకోవాల్సిందిగా సూచించారు. కోవిడ్‌-19 సంక్షోభం నేప‌థ్యంలో ప్ర‌జ‌లు త‌మ ఇళ్ల‌లోనే పండుగ‌ను చేసుకోవాల్సిందిగా కోరారు. 11వ రోజు ఉత్స‌వాన్ని సాంప్ర‌దాయం ప్ర‌కారం గ‌ణేష్ ఆల‌యాల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. వ‌చ్చే ఏడాది ప్ర‌భుత్వ‌మే బోనాలు, వినాయ‌క చ‌వితిని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

Tags :
|
|
|

Advertisement