Advertisement

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

By: chandrasekar Tue, 01 Dec 2020 11:56 AM

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధం


జీహెచ్ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు సర్వం సిద్ధమైంది. ఈరోజు పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 150 డివిజన్లకు గాను 1122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుండి 150, బీజేపీ నుండి 149, కాంగ్రెస్ నుండి 146, టీడీపీ నుండి 106, ఎంఐఎం నుండి 51, సీపీఐ నుండి 17, సీపీఎం నుండి 12, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుండి 76, స్వతంత్ర అభ్యర్థులుగా 415 మంది తమ అదృష్టాన్ని ఈ ఎన్నికల్లో పరీక్షించుకోనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో కలిపి మొత్తం 9101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 2272 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తారు.

ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగా కుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా కారణంగా పోలింగ్ కేంద్రాలను కూడా అధికంగా ఏర్పాటు చేశారు. అత్యధికంగా కొండాపూర్ డివిజన్‌లో 99 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక ఎన్నికల కోసం అధికారులను కూడా పెద్ద సంఖ్యలో వినియోగించుకోనున్నారు. ఇక గ్రేటర్ పోరుకు భారీ బందోబస్తు కూడా ఏర్పాట్లు చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఎన్నికలు ఉండడంతో అన్నీ కలిపి సుమారు 52వేల
మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. సున్నితమై, సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తూ, ఎల్బీనగర్ పరిధిలో రాచకొండ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించారు. ఇక 36,404 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహణలో ఉన్నారు. వారు ఇప్పటికే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని తీసుకుని వెళ్లినట్లు తెలిపారు.

ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఉదయం 6.15 గంటల వరకు నమూనా పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకు అసలైన పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. కరోనా నేపథ్యంలో వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు. అందుకోసం 2629 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. ఓటు వేసేందుకు వెళ్లే వారు తమతోపాటు తప్పనిసరిగా ఓటర్ కార్డు తీసుకుని వెళ్లాలి. ఒకవేళ ఓటర్ కార్డు లేకపోతే ఎన్నికల కమిషన్ సూచించిన ఏదైనా 18 పత్రాల్లో ఒకదాన్ని తీసుకుని వెళ్లాలి. అవేవీ లేకపోతే మీరు ఓటు వేయడానికి వీలు పడదు. అలాగే, పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకపోతే నో ఎంట్రీ. కరోనా కారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే, శానిటైజర్లు, ఇతర సౌకర్యాలు కల్పించారు. డిసెంబర్ 4న ఎన్నికల కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.

ప్రతుతం ఎన్నికల్లో మొత్తం ఓటర్లు: 74,44,260 గాను పురుషులు: 38,77,688 గాను స్త్రీలు: 35,65,896 గాను ఇతరులు: 676 గాను వున్నారు. మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధిక ఓటర్లు: 79,579 గాను రాంచంద్రాపురంలో అత్యల్ప ఓటర్లు: 27,948 గాను వున్నారు. ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులు: 1,122 గాను జంగమ్మెట్‌లో అత్యధికంగా పోటీలో: 20 మంది వున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం పోలింగ్‌ కేంద్రాలు: 9,101 గాను సున్నితమైనవి: 2,336 గాను అతి సున్నితమైనవి: 1,207 గాను క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్లు: 279 గాను కౌంటింగ్ హాళ్లు: 158 గాను గాను కౌంటింగ్ కేంద్రాలు: 150 గాను డీఆర్‌సీ కేంద్రాలు: 30 గాను గాను బ్యాలెట్ బాక్సులు: 28,686 గాను సాధార‌ణ ప‌రిశీల‌కులు: 12 గాను వ్యయ ప‌రిశీల‌కులు: 30 గాను ఫ్ల‌యింగ్ స్వ్కాడ్‌: 60 గాను జోన‌ల్/ రూట్ ఆఫీస‌ర్లు: 661 మందిని నియమించారు.

Tags :
|
|
|
|

Advertisement