Advertisement

  • జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ నిర్వ‌హ‌ణ‌కు 45 వేల మంది సిబ్బంది

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ నిర్వ‌హ‌ణ‌కు 45 వేల మంది సిబ్బంది

By: chandrasekar Wed, 18 Nov 2020 07:29 AM

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ నిర్వ‌హ‌ణ‌కు 45 వేల మంది సిబ్బంది


తెలంగాణాలో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ నిర్వ‌హ‌ణ‌కు 45 వేల మంది సిబ్బందిని నియమించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి సమన్వయంతో పనిచేయాలని నోడల్‌ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌, ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్‌ అన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 45 వేల మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇందుకోసం ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 25లోగా ఓటర్లకు ఓటరు స్లిప్‌ల పంపిణీ కూడా పూర్తి చేస్తామని అన్నారు. మైక్రో అబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్ వాలంటీర్ల నియామకం వెంటనే చేపట్టాలని నోడల్ ఆఫీసర్ల‌ను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రదేశాల్లో రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాల‌న్నారు.

ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల స్వీకరణకు జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌తోపాటు అన్ని జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో ఎన్నికల కాల్ సెంటర్ల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి చేయాలని సూచించారు.

Tags :
|
|
|
|

Advertisement