Advertisement

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ-ఓటింగ్…ఇదో కొత్త ప్రయోగం...!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ-ఓటింగ్…ఇదో కొత్త ప్రయోగం...!

By: Anji Mon, 02 Nov 2020 9:36 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ-ఓటింగ్…ఇదో కొత్త ప్రయోగం...!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఓ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు అధికారులు. అందులోభాగంగా ఈ ఎన్నికల్లో ఈ-ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు వృద్ధులకు, కరోనాతో క్వారంటైన్‌లో ఉన్నవారికి ఈ- ఓటింగ్ అవకాశం కల్పిస్తారు.

పోలింగ్‌ కేంద్రం వరకు రాలేని వారి కోసం ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఈ ఎన్నికల్లో అనుసరించేందుకు సరైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి పరుస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఓటింగ్‌ అంశంపై సాంకేతిక నిపుణులతో ఈసీ సమావేశమైంది.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించే అంశంపై చర్చించి నిర్ణయ తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. వరంగల్‌, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ- ఓటింగ్ అమలు చేసే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ ఓటింగ్ ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు వృద్ధులకు, కరోనాతో క్వారంటైన్‌లో ఉన్నవారు ఈ ఓటింగ్ విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం అమలులోకి వస్తే ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags :

Advertisement