Advertisement

  • ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ...ఈ సారి పోలింగ్ భారీగా తగ్గే అవకాశం

ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ...ఈ సారి పోలింగ్ భారీగా తగ్గే అవకాశం

By: Sankar Tue, 01 Dec 2020 8:05 PM

ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ...ఈ సారి పోలింగ్ భారీగా తగ్గే అవకాశం


హైదరాబాద్ లో ఆసక్తి రేపిన గ్రేటర్ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ పోలింగ్ ముగిసింది. అయితే గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

శని ఆదివారాలు సెలవు రోజులు కలిసి రావడం మధ్యలో సోమవారం ఒక్కటే ఉండటంతో చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లి పోయారు అని భావిస్తున్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాన్ని గనక చూస్తే మొత్తం మీద 35.80 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఆరు గంటల వరకు జరిగిన తుది నివేదిక రావడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

ఎందుకంటే 6 గంటల వరకు క్యూలో నిలబడిన వారికి ఓటు వేసే వరకు అవకాశం కల్పించనున్నారు. 5 గంటల నుంచి 6 గంటల వరకు కరోనా పేషెంట్ లు వోటు వేసేందుకు అవకాశం ఇచ్చింది ఎన్నికల సంఘం. ఇక ప్రతి పోలింగ్ బూత్ లో కూడా పీపీఈ కిట్ లను ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది

Tags :
|
|

Advertisement