Advertisement

జిహెచ్ఎంసి ఎన్నికల కోసం కొత్త యాప్

By: Sankar Sat, 28 Nov 2020 7:44 PM

జిహెచ్ఎంసి ఎన్నికల కోసం కొత్త యాప్


గ్రేటర్‌ ఓటర్‌లకు శుభవార్త. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ఓటు ఓటు హక్కు వినియోగించుకునే వారు తమ ఓటరు స్లీప్‌తో పాటు పోలీంగ్‌ బూత్‌ను అరచేతిలోనే తెలుసుకునేందుకు జీహెచ్‌ఎం‍సీ కొత్త యాప్‌ను రూపొందించింది.

దీంతో మీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఒటరు స్లీప్‌తో పాటు, పోలింగ్ కేంద్రం ఎక్కడుందో గూగుల్ మ్యాప్‌తో తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ ఓటర్ల కోసం మైజీహెచ్ఎంసీ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఇప్పటికే నగరంలోని ఓటర్లకు ఓటరు స్లీప్‌ల పంపిణిని జీహెచ్ఎంసీ చేపట్టింది.

అయితే, నగర ఓటర్లలో అధిక శాతం మందికి మొబైల్ ఫోన్‌లు ఉండడంతో అర చేతిలోనే ఓటరు పోలింగ్ బూత్, ఓటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా ఈ మొబైల్ యాప్‌ను రూపొందించింది. అయితే అది తెలుసుకోవాలంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లో మైజీహెచ్ఎంసీ యాప్‌ను లౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Tags :
|
|

Advertisement