Advertisement

  • ఓటర్ల చైతన్య కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి

ఓటర్ల చైతన్య కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి

By: Sankar Sun, 29 Nov 2020 3:59 PM

ఓటర్ల చైతన్య కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి


గ్రేటర్‌ ఎన్నికల ఓటింగ్‌ పెంపునకు జీహెచ్‌ఎంసీ పెద్దఎత్తున చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. గ్రేట‌ర్ ప‌రిధిలోని ఓట‌ర్లంద‌రికీ ఓట‌రు స్లిప్‌ల‌ పంపిణీ చేయడంతో పాటు, ఓటరు స్లిప్‌ల డౌన్‌లోడ్‌కు ప్రత్యేక యాప్ రూపొందించింది.

‘మైజీహెచ్ఎంసీ యాప్’ లో నో యువర్ ఓట్ ఆప్షన్‌లో పేరు, వార్డు నంబర్‌ ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్, పోలింగ్ లొకేషన్ గూగుల్ మ్యాప్ కూడా వస్తుంది. నో యువర్ ఓట్‌పై ఎఫ్ఎం రేడియో, టి.వి స్క్రోలింగ్, బస్ షెల్టర్లపై హోర్డింగ్‌ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.

మొట్టమొద‌టి సారిగా ఓట‌ర్ల జాబితాను రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం వెబ్‌సైట్‌లో ప్రదర్శన, ఓట‌రు చైత‌న్యంపై పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు, జీహెచ్ఎంసీకి చెందిన 1500 సెల్‌ఫోన్ల రింగ్‌టోన్ల ద్వారా ఓట‌ర్లను చైతన్యపర్చడం, ఎన్నిక‌ల ప్రవర్తన నియ‌మావ‌ళి అమ‌లుకు ప‌లు క‌మిటీలను ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాల ద్వారా ప్రత్యేక ఓటరు చైతన్య కార్యక్రమం చేపట్టింది.

Tags :
|
|

Advertisement