Advertisement

  • GHMC...ఇది సెమీ ఫైనల్స్ మాత్రమే.. అసలు ఆట ఫైనల్‌లో...

GHMC...ఇది సెమీ ఫైనల్స్ మాత్రమే.. అసలు ఆట ఫైనల్‌లో...

By: chandrasekar Fri, 04 Dec 2020 8:12 PM

GHMC...ఇది సెమీ ఫైనల్స్ మాత్రమే.. అసలు ఆట ఫైనల్‌లో...


గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎలక్షన్స్ 2020 ఫలితాలలో బీజేపీ పుంజుకుంది. గత ఎన్నికల్లో కేవలం 4 సీట్లకే పరిమితమైన బీజేపీ.. ఈసారి ఏకంగా 40కి పైగా సీట్లు సాధించింది. అధికార టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చించింది. జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ ప్రదర్శనపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సెమీ ఫైనల్స్ మాత్రమే.. అసలు ఆట ఫైనల్‌లో ఉంటుందని ఆయన అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ''100 వస్తాయనుకున్నాం. 4 నుంచి 40 వరకు పోతున్నాం. ఇది సెమీఫైనల్స్. ఫైనల్స్‌ మ్యాచ్‌లో సత్తా చాటుతాం. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. టీఆర్ఎస్ అవినీతి, మేం చేయబోయే అభివృద్ధి గురించి ఇంకా ప్రజల్లో అవగాహన పెంచుతాం. ప్రతిపక్షంలో మేమే ఉంటున్నాం. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతమవుతాం. ఎన్నికల్లో బోగస్ ఎక్కువ జరిగింది. బీజేపీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అవకతవకలకు జరిగాయి. మా ఓటర్లను తొలగించారు. అందుకే తక్కువ సీట్లు వచ్చాయి. లేదంటే ఫలితాలు మరోలా ఉండేవి.'' అని రాజాసింగ్ తెలిపారు.

సాయంత్రం 6 గంటల సమయానికి బీజేపీ 37 సీట్లలో గెలిచి.. మరో 11 సీట్లలో ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ 45 సీట్లలో విజయం సాధించగా మరో 12 చోట్ల లీడింగ్‌లో ఉంది. ఇక ఎప్పటిలాగే పాతబస్తీలో సత్తాచాటుతోంది ఎంఐఎం. ఇప్పటి వరకు 39 సీట్లలో విజయం సాధించిన మజ్లిస్ పార్టీ.. మరో 3 చోట్ల లీడింగ్‌లో ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కేవలం రెండు సీట్లలో మాత్రమే విజయం సాధించింది. ఇక టీడీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. బీజేపీ ఏకంగా 40 సీట్లకు పైగా సాధించండం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయంశమైంది. పలు చోట్ల టీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చింది బీజేపీ. హబ్సిగూడ డివిజన్‌లో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భార్య స్వప్న ఓడిపోయారు. ఈమెపై బీజేపీ అభ్యర్థి చేతన విజయం సాధించారు. అటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కంచుకోటగా చెప్పుకునే మోండా మార్కెట్‌లో కాషాయ జెండా ఎగిరింది. ఈ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి కొంతం దీపిక విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల పుష్ప ఓటమి పాలయ్యారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన పుష్ప.. ఈసారి మాత్రం ఓడిపోయారు. మోండా మార్కెట్‌లో బీజేపీ విజయాన్ని.. మంత్రి తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు

Tags :
|

Advertisement