Advertisement

  • జర్మనీ లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు

జర్మనీ లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Fri, 18 Dec 2020 11:13 AM

జర్మనీ లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు


ప్రపంచ వ్యాపతంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి ..కరోనా వచ్చి దాదాపు ఏడాది కావొస్తున్నా ఇంతవరకు ఏ మాత్రము కరోనా తగ్గడం లేదు ..ఒకవైపు కరోనా వాక్సిన్ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి..తాజాగా జర్మనీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి.

ఒక్కరోజులో 33,777 కేసులను నమోదు చేసి దేశంలో ఇప్పటి వరకు నమోదయిన అత్యదిక ఒక్కరోజు కేసులుగా నమోదయింది. దీంతో దేశంలో ఇప్పటికి నమోదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,439,938కి చేరింది. దాంతో పాటుగా గత 24 గంటల్లో 813 మంది మరణించారు. ఈ మరణాలతో దేశంలోని మరణాల సంఖ్య 24,938కి ఎగబాకింది.

అదే రీతిలో కోలుకున్నవారి సంఖ్య కూడా పెరగడం శుభ వార్తుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కలోకున్న వారి సంఖ్య దాదాపు 1.06మిలియన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో కరోనా విజృంభనను అరికట్టేందుక జర్మనీ ప్రభుత్వం ఈ నెల 16 నుంచి జనవరీ 10 వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించింది

Tags :
|

Advertisement