Advertisement

  • జర్మనీలో దాదాపు మూడు నెలల తర్వాత వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు

జర్మనీలో దాదాపు మూడు నెలల తర్వాత వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు

By: Sankar Thu, 06 Aug 2020 4:32 PM

జర్మనీలో దాదాపు మూడు నెలల తర్వాత వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు



యూరోప్ దేశాల్లో కరోనా తొలినాళ్లలో విపరీతంగా విజృంభించినప్పటికీ ..ఇటీవల కాలం లో కొంచెం తగ్గుముఖం పట్టింది ..యూరోప్ లో ఇటలీ , స్పెయిన్ , ఫ్రాన్స్ , జర్మనీ వంటి దేశాలు కరోనా దాటికి అతలాకుతలం అయ్యాయి ..అయితే ఇటీవల తగ్గినట్లు అనిపించినా కరోనా తిరిగి విజృంభిస్తుంధీ ..తాజాగా జెర్మనీ లో దాదాపు మూడు నెలల తర్వాత మళ్ళీ వెయ్యికి పైగా కేసులు నమోదు అయ్యాయి..

మూడు నెలల తర్వాత ఒక రోజులో అత్యధికంగా కరోనా కేసులు నమోదైనట్లు జర్మనీ జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం వెల్లడించింది. బుధవారం దేశంలో కొత్తగా 1,045 కేసులు నమోదయ్యాయని రాబర్ట్‌ కోచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. మే 7 తర్వాత ఒక రోజులో 1000కి పైగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. ఏప్రిల్‌ ప్రారంభంలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నది.

ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్‌ ధరించాలని అధికారులు కోరారు. జర్మనీలో కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. దేశంలో ఇప్పటి వరకు 2,14,104 కరోనా కేసులు నమోదు కాగా 9,245 మంది చనిపోయారు.

Tags :
|
|
|

Advertisement