Advertisement

  • జర్మనీకి చెందిన మెర్సిడెజ్‌ బెంజ్ తొలి ఎలక్ట్రిక్ వాహనం 'ఈక్యూసీ' భారత మార్కెట్లో

జర్మనీకి చెందిన మెర్సిడెజ్‌ బెంజ్ తొలి ఎలక్ట్రిక్ వాహనం 'ఈక్యూసీ' భారత మార్కెట్లో

By: chandrasekar Fri, 09 Oct 2020 5:49 PM

జర్మనీకి చెందిన మెర్సిడెజ్‌ బెంజ్ తొలి ఎలక్ట్రిక్  వాహనం 'ఈక్యూసీ' భారత మార్కెట్లో


దేశంలో ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి అవకాశాలను కల్పిస్తున్నది. లగ్జరీ కారు బ్రాండ్ కు చెందిన దిగ్గజ కంపెనీ జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌ భారత మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్ వాహనం ఈక్యూసీని ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ.99.30 లక్షలు. తొలి 50 కార్లకే ఈ ధర వర్తిస్తుంది. దీనికి అమర్చిన 80 కిలోవాట్ల లిథియం అయాన్‌ బ్యాటరీ ఒకసారి చార్జి చేస్తే 445-471 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అధునాతన హంగులతో ఈ కారు లభ్యం కానుంది.

ఈ ఎలక్ట్రిక్ కారు 100 కిలోమీటర్ల దూరానికి 20.8-19.7 కిలోవాట్ల విద్యుత్‌ వినియోగించుకుంటుంది. ముందు, వెనుక యాక్సిల్స్‌కు అమర్చిన రెండు మోటార్లు కలిసి 408 హార్స్‌ పవర్‌ శక్తిని అందిస్తాయి. దీంతో 5.1 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఇ-కామర్స్‌ సైట్‌లో అందుబాటులో ఉంచడంతో పాటు ఢిల్లీ, ముంబై, పూణె, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాల్లో దీన్ని రిటైల్‌గా విక్రయించనున్నట్టు కంపెనీ సీఈఓ మార్టిన్‌ ష్వెంక్‌ ప్రకటించారు. దేశంలోని 48 నగరాల్లో 100 ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న తమ చార్జింగ్‌ నెట్‌వర్క్‌లో కారు చార్జింగ్‌ చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. ప్రజల మధ్య ఈ కారుకు మంచి ఆదరణ లభిస్తుందని తెలిపింది.

Tags :
|

Advertisement