Advertisement

  • సెంచరీ మిస్ అయ్యిందన్న ఫ్రస్ట్రేషన్‌లో బ్యాట్‌ని విసిరిగొట్టిన గేల్...వీడియో వైరల్

సెంచరీ మిస్ అయ్యిందన్న ఫ్రస్ట్రేషన్‌లో బ్యాట్‌ని విసిరిగొట్టిన గేల్...వీడియో వైరల్

By: chandrasekar Sat, 31 Oct 2020 1:20 PM

సెంచరీ మిస్ అయ్యిందన్న ఫ్రస్ట్రేషన్‌లో బ్యాట్‌ని విసిరిగొట్టిన గేల్...వీడియో వైరల్


అబుదాబిలో షేక్ జాయెద్ స్టేడియంలో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ సిక్స్‌ల వర్షం కురిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రెండు లైఫ్‌లు దొరకడంతో వాటిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం 63 బంతుల్లో 99 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్స్‌లు, ఫోర్లు ఉన్నాయి. ఐతే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్ట్ అయ్యి.. సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఒక్క పరుగు చేస్తే సెంచరీ పూర్తయ్యేది. ఆర్చర్ వేసిన ఆఖరి ఓవర్లో మూడో బంతికి సిక్స్ కొట్టిన గేల్.. ఆ తర్వాతి బంతిని కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బోల్డ్ అయ్యాడు. ఒక పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యిందన్న ఫ్రస్ట్రేషన్‌లో బ్యాట్‌ని విసిరికొట్టాడు గేల్. బ్యాట్ చాలా దూరం ఎగిరిపోయి పడిపోయింది. బౌల్డ్ అయిన తర్వాత.. నేరుగా జోఫ్రా ఆర్చర్ వద్దకు వెళ్లిన గేల్, అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. గుడ్ బాల్ అని మెచ్చుకున్నాడు. అనంతరం బ్యాట్ తీసుకొని.. దానిపై క్యాప్ తగిలించి.. ఫెవిలియన్‌కు వెళ్లాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడిన క్రిస్ గేల్.. ''180 పరుగులు మంచి స్కోర్ అని భావించా. ఇది మంచి వికెట్. సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి మరింత బెటర్ అవుతుంది. 99 పరుగుల వద్ద ఔట్ కావడం దురదృష్టకరం. ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ అది చక్కటి బంతి. సెంచరీ చేయనప్పటికీ బాగా ఆడాను.'' అని పేర్కొన్నాడు క్రిస్ గేల్. కాగా, ఐపీఎల్‌లో రెండు సార్లు సెంచరీ మిస్ చేసుకున్నాడు క్రిస్ గేల్. గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌ల్లో సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. 99 పరుగుల వద్ద ఆర్చర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్.. 276 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీల ఉన్నాయి. 144.50 స్ట్రైక్ రేట్‌తో 46 సగటును నమోదు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 15 ఫోర్లు, 23 సిక్స్‌లు బాదాడు. టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు గేల్. అతడు జట్టులోకి వచ్చిన తర్వాత పంజాబ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.

Tags :
|

Advertisement