Advertisement

  • ఐపీయల్ లో ఆ ఆటగాళ్లు తమదేశ ఆటగాడి పట్ల పక్షపాతంతో వ్యవహరించారు ..గవాస్కర్ సంచలన ఆరోపణలు

ఐపీయల్ లో ఆ ఆటగాళ్లు తమదేశ ఆటగాడి పట్ల పక్షపాతంతో వ్యవహరించారు ..గవాస్కర్ సంచలన ఆరోపణలు

By: Sankar Fri, 02 Oct 2020 4:33 PM

ఐపీయల్ లో ఆ ఆటగాళ్లు తమదేశ ఆటగాడి పట్ల పక్షపాతంతో వ్యవహరించారు ..గవాస్కర్ సంచలన ఆరోపణలు

ఐపీయల్ అనేది అనేక దేశాల ఆటగాళ్లు ఆడే టోర్నీ ..ఇందులో ఒకే దేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు ఐపీయల్ లో మాత్రం వేరే వేరే జట్లకు ఆడుతారు..అయితే ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ దేశపు ఆటగాళ్లు ఎదురయినప్పుడు పక్షపాతం తో వ్యవహరిస్తున్నారా అని అనుమానపడుతున్నారు మాజీ ఆటగాళ్లు కొందరు..

దుబాయ్ వేదికగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగగా.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కి ఆ దేశానికి చెందిన ఫాస్ట్ బౌలర్లు జోప్రా ఆర్చర్, టామ్ కరన్ కనీసం ఒక్క బౌన్సర్ కూడా వేయకపోవడం సందేహాలకి తావిస్తోంది. ఇదే విషయాన్ని వెలుగులోకి తెచ్చిన సునీల్ గవాస్కర్.. ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

కేకేఆర్ , రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ తరుపున బరిలో దిగిన మోర్గాన్ తొలుత బంతిని సరిగా ఆడలేకపోయాడు కానీ.. రాజస్థాన్‌కి చెందిన ఫాస్ట్ బౌలర్లు జోప్రా ఆర్చర్, టామ్ కరన్ అతనికి కనీసం ఒక్క బౌన్సర్‌ని కూడా సంధించలేదు. ఎట్టకేలకి స్లాగ్ ఓవర్లలో టచ్‌లోకి వచ్చిన మోర్గాన్ రెండు సిక్సర్లు కొట్టి విలువైన పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా ఇటీవల జోప్రా ఆర్చర్ గంటకి 152.13 కిమీ వేగంతో రికార్డ్ నెలకొల్పిన విషయం తెలిసిందే.

ఇయాన్ మోర్గాన్‌కి మ్యాచ్‌లో కనీసం ఒక్క బౌన్సర్‌ని కూడా జోప్రా ఆర్చర్ సంధించలేదు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉన్న ఆర్చర్ నుంచి నేను ఇది ఊహించలేదు. ఇక టామ్ కరన్ అయితే ఫుల్‌టాస్ బంతి వేసి మరీ తన కెప్టెన్‌కి సిక్స్ సమర్పించుకున్నాడు అని సునీల్ గవాస్కర్ ఆరోపణలు గుప్పించాడు

Tags :

Advertisement