Advertisement

  • ధోనిలాగా సిక్సర్లు కొట్టినంత మాత్రాన ఎవ్వరు ధోని అయిపోరు.... గౌతమ్ గంబీర్

ధోనిలాగా సిక్సర్లు కొట్టినంత మాత్రాన ఎవ్వరు ధోని అయిపోరు.... గౌతమ్ గంబీర్

By: Sankar Fri, 06 Nov 2020 3:51 PM

ధోనిలాగా సిక్సర్లు కొట్టినంత మాత్రాన ఎవ్వరు ధోని అయిపోరు.... గౌతమ్ గంబీర్


భారత క్రికెట్ లో లెజెండరీ ఆటగాడు ధోని తర్వాత కీపర్ ఎవరు అంటే చాలా మంది పంత్ వైపు చూసారు..ఐపీయల్ లో అద్భుత ఆటతీరుతో చెలరేగిన పంత్ ధోని వారసుడిని తానే అని అందరితో అనిపించుకున్నాడు..అయితే ఆ తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో అంతగా ఆకట్టుకోలేకపోవడం , వికెట్ వెంటనే పారేసుకోవడం తో పంత్ మీద విమర్శలు మొదలయ్యాయి..ఇక ఈ ఐపీయల్ లో పంత్ ప్రదర్శన అంతకంతకు దిగజారుతోంది ..

ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్‌ కీపర్‌ స్థానాన్ని కేఎల్‌ రాహుల్‌ భర్తీ చేయడంతో మెల్లగా అతడికి అవకాశకాలు సన్నగిల్లాయి. ఈ విషయం గురించి టీమిండియా మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలుత పంత్‌ను ధోనితో పోల్చడం మానుకోవాలని సూచించాడు. ‘‘పంత్‌ ఎప్పటికీ ధోని కాలేడు. అతడిని రిషభ్‌ పంత్‌గానే ఉండనివ్వండి.

మీడియా ఈ పోలిక గురించి మాట్లాడినంత కాలం, పంత్‌ సైతం తనకు అవకాశాలు వస్తాయని భావిస్తూనే ఉంటాడు. ఎంఎస్‌ ధోనిలాగా సిక్సర్లు కొట్టినంత మాత్రాన ఎవరూ ధోనిలా అయిపోరు. రిషభ్‌ పంత్‌ తన ఆటతీరును ఇంకా మెరుగపరచుకోవాల్సి ఉంది. కీపింగ్‌, బ్యాటింగ్‌పై దృష్టి సారించాల్సిన అవశ్యకత ఉంది’’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో బీసీసీఐ ఇటీవల ప్రకటించిన జట్టు(టెస్టు)లో పంత్‌ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే

Tags :

Advertisement