Advertisement

  • క్రికెట్ లో ఎన్ని రికార్డులు బద్దలు అయినా ..ధోని సాధించిన ఆ రికార్డు మాత్రం చెరగదు..గంభీర్

క్రికెట్ లో ఎన్ని రికార్డులు బద్దలు అయినా ..ధోని సాధించిన ఆ రికార్డు మాత్రం చెరగదు..గంభీర్

By: Sankar Mon, 17 Aug 2020 11:43 AM

క్రికెట్ లో ఎన్ని రికార్డులు బద్దలు అయినా ..ధోని సాధించిన ఆ రికార్డు మాత్రం చెరగదు..గంభీర్


టీమిండియా‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ స్పందించారు. ధోని తన సారథ్యంలో భారత్‌కు చిరస్మరణీయమైన విజయాలు అందించి, రికార్డులు సృష్టించాడని ప్రశంసించారు. ఆయన క్రికెట్ కనెక్ట్ షోలో మాట్లాడుతూ.. టీమిండియా కెప్టెన్‌గా ధోని నెలకొల్పిన రికార్డులు చిరస్థాయిలో నిలిచిపోతాయని తెలిపారు. అదే విధంగా మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన కెప్టెన్‌గా ధోని రికార్డును ఎవరు అందుకోలేరని పేర్కొన్నారు. ఆ రికార్డు ఆయన పేరు మీదనే ఉంటుందన్నారు.

నేను ఈ విషయంతో ఛాలెంజ్‌ చేయగలనని పేర్కొన్నారు.సెంచరీలు, డబుల్‌ సెంచరీలకు సంబంధించిన రికార్డులు సైతం బ్రేక్‌ అవుతాయి. కానీ, ధోని కెప్టెన్‌గా సాధించిన మూడు ఐసీసీ ట్రోఫీల రికార్డు మాత్రం సమీప భవిష్యత్తులో ఏ కెప్టెన్‌ బ్రేక్‌ చేయలేరని అన్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతూ మహేంద్ర సింగ్‌ ధోని ఆగస్టు 15న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..

అయితే అనూహ్యంగా ఆంతర్జాతీయ క్రికెట్ నుంచి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే..గత ఏడాది న్యూజీలాండ్ తో జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో బరిలోకి దిగిన ధోని ఇక ఆ తర్వాత మైదానంలోకి రాకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడు..అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ఐపీయల్ లో ఆడుతుండటం అభిమానులకు కొంచెం ఊరట..

Tags :
|
|

Advertisement