Advertisement

  • గంగూలీ మంచి జట్టును తయారు చేసి ధోని చేతిలో పెట్టాడు ..గంభీర్

గంగూలీ మంచి జట్టును తయారు చేసి ధోని చేతిలో పెట్టాడు ..గంభీర్

By: Sankar Sun, 12 July 2020 06:53 AM

గంగూలీ మంచి జట్టును తయారు చేసి ధోని చేతిలో పెట్టాడు ..గంభీర్



ఇండియన్ క్రికెట్ లో దిగ్గజ కెప్టెన్ల లిస్ట్ తీస్తే అందులో ముందు వరుసలో ఉండే ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ , మహేంద్ర సింగ్ ధోని ..ఈ ఇద్దరు ఆటగాళ్లు కెప్టెన్లుగా ఇండియన్ క్రికెట్ను ఉన్నత స్థానంలో నిలిపారు ..అయితే ఇండియన్ క్రికెట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుని అత్యంత కష్టాల్లో ఉన్న దశలో కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్న దాదా గంగూలీ ..ఇండియన్ టీం ను మల్లి గాడిలో పెట్టాడు ..యువ ఆటగాళ్లకు అండగా ఉంటూ వాళ్ళను తీర్చిదిద్దాడు ..ఆలా గంగూలీ కెప్టెన్సీ లో తయారు అయి సెహ్వాగ్ , యువరాజ్ , హర్భజన్ సింగ్ , జహీర్ ఖాన్ లు తర్వాత కాలంలో దిగ్గజ ఆటగాళ్లుగా మారి ఇండియన్ క్రికెట్ విజయాలలో కీలక భాగస్వామ్యం అయ్యారు ..

తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ గంగూలీ కెప్టెన్సీ లో కష్టపడితే ఆ ఫలితాలని మూడు ఐసీసీ టోర్నీ ల రూపంలో ధోనిని వరించాయి అని అన్నాడు .. ధోనీ చాలా లక్కీ కెప్టెన్. ప్రతి ఫార్మాట్‌లోనూ అతనికి మంచి టీమ్ దొరికింది. ముఖ్యంగా.. 2011 వన్డే ప్రపంచకప్‌‌కి సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, నేను (గంభీర్), యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, విరాట్ కోహ్లీ తదితరులు టీమ్‌లో ఉన్నాం. కాబట్టి.. మెరుగైన టీమ్‌ని కెప్టెన్‌గా నడిపించడం ధోనీకి సులువైంది. జట్టులో అలా సమతూకం తెచ్చేందుకు కెప్టెన్‌గా గంగూలీ అప్పట్లో చాలా కష్టపడ్డాడు. దాని ఫలితమే ధోనీ కెప్టెన్సీలోని భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలను గెలవగలిగింది’’ అని వెల్లడించాడు.

అయితే 2007లో భారత టీ20 జట్టుకి కెప్టెన్‌గా మారిన ధోనీ.. అదే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాని విజేతగా నిలిపాడు. ఆ తర్వాత 2011 వన్డే ప్రపంచకప్‌ని గెలవడం ద్వారా భారత్ 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకి తెరించిన ధోనీ.. కెప్టెన్‌గా 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచాడు. మొత్తంగా... క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ఘనత సాధించాడు.



Tags :
|
|
|
|
|

Advertisement