Advertisement

  • రైనా ఐపీయల్ నుంచి తప్పుకోవడంతో ధోని ఆ బాధ్యత తీసుకోవాలి ..గౌతమ్ గంభీర్

రైనా ఐపీయల్ నుంచి తప్పుకోవడంతో ధోని ఆ బాధ్యత తీసుకోవాలి ..గౌతమ్ గంభీర్

By: Sankar Tue, 01 Sept 2020 2:13 PM

రైనా ఐపీయల్ నుంచి తప్పుకోవడంతో ధోని ఆ బాధ్యత తీసుకోవాలి ..గౌతమ్ గంభీర్


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి సురేష్ రైనా తప్పుకోవడంతో ధోనికి ఇదే మంచి అవకాశం అని అన్నాడు గౌతమ్ గంభీర్..సురేశ్ రైనా ఆడిన నెం.3లో మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ చేయాలని తాజాగా స్టార్‌స్పోర్ట్స్ షో క్రికెట్ కనెక్టెడ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ సూచించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కొత్తలో నెం.3లో ఆడిన ధోనీ సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి.. టీమిండియాకి తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. దాంతో.. నెం.3లో ఆడిన అనుభవం ఉన్న ధోనీ.. మరోసారి ఆ బాధ్యతలు స్వీకరించాలని గంభీర్ సూచించాడు. ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ఇకపై కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడనున్నాడు.

నెం.3లో మళ్లీ ఆడేందుకు ధోనీకి ఇది మంచి అవకాశం. గత ఏడాదికాలంగా అతను క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. కాబట్టి.. ఇప్పుడు నెం.3లో ఆడితే..? ఎక్కువ బంతులు ఎదుర్కొనే ఛాన్స్ లభిస్తుంది. గతంలోనూ టీమిండియాకి యాంకర్ ఇన్నింగ్స్‌లు ఆడిన ధోనీ అనుభవం ఇక్కడ కలిసిరానుంది. ఒకవేళ ధోనీ నెం.3లో ఆడగలిగితే.. ఆ తర్వాత స్థానాల్లో కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, శామ్ కరన్ ఆడతారు’’ అని గంభీర్ వెల్లడించాడు. సాధారణంగా ఐపీఎల్‌లో నెం.5 లేదా నెం.6లో ధోనీ బ్యాటింగ్‌కి వస్తుంటాడు. కొన్నిసార్లు మ్యాచ్ గమనానికి అనుగుణంగా బ్యాటింగ్ ఆర్డర్‌ని ధోనీ మార్చుకుంటూ ఉంటాడు.

Tags :
|
|
|

Advertisement