Advertisement

  • ధోని మ్యాచ్ విన్నర్లను తయారు చేయలేదు ..అందుకే కోహ్లీ మేజర్ టోర్నీలు గెలవలేకపోతున్నాడు ..గంభీర్

ధోని మ్యాచ్ విన్నర్లను తయారు చేయలేదు ..అందుకే కోహ్లీ మేజర్ టోర్నీలు గెలవలేకపోతున్నాడు ..గంభీర్

By: Sankar Mon, 13 July 2020 6:22 PM

ధోని మ్యాచ్ విన్నర్లను తయారు చేయలేదు ..అందుకే కోహ్లీ మేజర్ టోర్నీలు గెలవలేకపోతున్నాడు ..గంభీర్



భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోన్ మీద విమర్శలు చేసాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ..సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా మంచి జట్టుని తయారు చేసి ధోనీకి ఇస్తే..? అతను మాత్రం కోహ్లీకి ట్రోఫీలను గెలిపించగలిగే జట్టుని ఇవ్వలేకపోయాడని గంభీర్ దుయ్యబట్టాడు. ఇటీవల ధోనీ‌ని లక్కీ కెప్టెన్‌గా అభివర్ణించిన గంభీర్.. మెరుగైన టీమ్‌ ఉండటంతోనే అతను పెద్దగా కష్టపడకుండానే ఐసీసీ ట్రోఫీలు గెలిచినట్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ‘‘ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు.. విరాట్ కోహ్లీకి క్వాలిటీ ప్లేయర్స్‌ని అతను ఇవ్వలేకపోయాడు. జట్టులో కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేరు. ముఖ్యంగా.. టోర్నమెంట్‌లలో జట్టుని గెలిపించగల వరల్డ్‌ క్లాస్ బ్యాట్స్‌మెన్‌లు లేరు. అప్పట్లో సౌరవ్ గంగూలీ.. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వారిని తయారుచేసి ధోనీకి ఇచ్చాడు. కానీ.. ధోనీ మాత్రం కోహ్లీకి ఎవరినిచ్చాడు..?’’ అని ప్రశ్నించాడు.

అయితే ధోని కెప్టెన్సీ లో వరుసగా ఐసీసీ ట్రోఫీలు గెలిచినా టీమిండియా ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ కెప్టెన్సీ లో మాత్రం ఇంతవరకు ఒక కప్పు కూడా గెలవలేకపోయింది ..కీలక మ్యాచ్ లలో తడబడటం అలవాటు గా మారింది ..జట్టు బ్యాటింగ్ కూడా కేవలం ఇద్దరు , ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే మోస్తున్నారు ..

Tags :
|
|
|
|

Advertisement