Advertisement

  • ధోని , నేను రూంమేట్స్ ...ధోనితో ఇండియా ఏ రోజులను గుర్తు చేసుకున్న గంభీర్

ధోని , నేను రూంమేట్స్ ...ధోనితో ఇండియా ఏ రోజులను గుర్తు చేసుకున్న గంభీర్

By: Sankar Mon, 13 July 2020 11:21 AM

ధోని , నేను రూంమేట్స్ ...ధోనితో ఇండియా ఏ రోజులను గుర్తు చేసుకున్న గంభీర్



ధోని మీద ఎక్కువగా విమర్శలు చేసే గంభీర్ తాజాగా ధోని మీద పొగడ్తలు కురిపించాడు .. క్రికెట్‌ కనెక్ట్‌ పేరుతో నిర్వహిస్తున్న ఒక స్పోర్ట్స్‌ షోలో ఆయన మాట్లాడారు. ధోని గురించి గంభీర్‌ మాట్లాడుతూ, తామిద్దరం రూమ్‌ మేట్స్‌ అని తెలిపారు. నెల రోజుల పాటు తామిద్దరం కలిసి ఒకే రూం లో ఉన్నామని, మాహీ చాలా మంచి వ్యక్తి అని గంభీర్‌ పేర్కొన్నారు. చిన్న రూంలో ఉన్న తామిద్దరం ఆ రూం పెద్దగా కనిపించడం కోసం మంచాలు తీసేసి బెడ్స్‌ వేసుకొని నేలపై పడుకునే వారమని చెప్పారు.

ఇక ధోని, తాను ఎప్పుడు జుట్టు గురించే మాట్లాడుకేనే వారమన్నారు. ధోనికి అప్పట్లో పొడుగాటి హెయిర్‌ స్టైల్‌ ఉండేది. అలా జుట్టును మెయిన్‌టైన్‌ చేయడం చాలా కష్టమని గంభీర్‌ తెలిపారు. ఇంకా ధోనితో కలిసి కెన్యా, జింబాంబ్వే, ఇండియా ఏ టూర్‌కు వెళ్లానని ఆ టూర్‌ బాగా ఎంజాయ్‌ చేశామని గంభీర్‌ చెప్పారు.

అయితే ఇదే షో లో గంభీర్తో కలిసి పాల్గొన్న సౌత్ ఆఫ్రికా మాజీ దిగ్గజ ఆటగాడు , ప్రస్తుత సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ కూడా ధోని మీద ప్రశంసలు కురిపించాడు ..అసలు ధోని తెలియని వారు క్రికెట్‌ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనే సందేహం వ్యక్తం చేశాడు. ధోని అంటే తెలియన వారు ఎవరూ ఉండరంటూ స్మిత్‌ కొనియాడాడు. ఇంకా ధోని గురించి మాట్లాడుతూ, అతను చాలా సౌమ్యుడని, అందరితో కలుపుగోలుగా ఉంటారని ప్రశంసించారు. ధోని అంటే తనకి ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు.


Tags :
|

Advertisement