Advertisement

  • సిఎస్కె జట్టులో చాలా మార్పులు జరగడం ఖాయం..గౌతమ్ గంభీర్

సిఎస్కె జట్టులో చాలా మార్పులు జరగడం ఖాయం..గౌతమ్ గంభీర్

By: Sankar Fri, 30 Oct 2020 6:54 PM

సిఎస్కె జట్టులో చాలా మార్పులు జరగడం ఖాయం..గౌతమ్ గంభీర్


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) చరిత్రను చూస్తే సీఎస్‌కే ఎప్పుడూ వేలంలో దూకుడుగా ఉన్న దాఖలాలు లేవని, ఈసారి మాత్రం వారు వేలంలో చాలా యాక్టివ్‌గా ఉండటం ఖాయమని మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ పేర్కొన్నాడు.

ఈ సీజన్‌లో సీఎస్‌కే లీగ్‌ దశ నుంచే నిష్క్రమించడంతో వచ్చే ఏడాది వేలానికి ఇప్పట్నుంచే రంగం సిద్ధం చేసుకుంటుందన్నాడు. వచ్చే ఏడాది కూడా ధోనినే సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నప్పటికీ యువ క్రికెటర్లను ఎక్కువ టార్గెట్‌ చేస్తూ ఐపీఎల్‌ వేలానికి వెళతారన్నాడు. వచ్చే ఏడాది సీఎస్‌కే జట్టులో చాలా మార్పులు జరగడం ఖాయమన్నాడు..

రిటైన్‌ కానీ యువ క్రికెటర్లపై సీఎస్‌కే గురిపెడుతుందని గంభీర్‌ అన్నాడు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న చాలా మందిని తిరిగి రిటైన్‌ చేసుకుంటుందన్నాడు. ఆ కోవలో ముందు వరుసలో ఉండేవాడు సామ్‌ కరాన్‌ అని గంభీర్‌ తెలిపాడు. సామ్‌ కరాన్‌ అద్భుతమైన ఆల్‌రౌండర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అతను రోజు రోజుకు ఎంతో పరిణితి సాధిస్తూ కీలక ఆల్‌రౌండర్‌ అవుతాడన్నాడు. టాప్‌ మోస్ట్‌ ఆల్‌రౌండర్‌గా సామ్‌ కరాన్‌ ఎదుగుతాడని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన గంభీర్‌ జోస్యం చెప్పాడు..

కాగా ఐపీయల్ చరిత్రలో ఎక్కువగా టీం ను మార్చిదానికి ఆసక్తి చూపించని జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ముందు వార్సుల్లో ఉంటుంది..కానీ ఈ ఏడాది ఆ జట్టు ప్రదర్శన చుసిన తర్వాత జట్టులో మార్పులు ఖాయం అని చాలా మంది మాజీలు అభిప్రాయపడుతున్నారు..ముఖ్యంగా ఏజ్ అయిపోయి రిటైర్మెంట్ దగ్గర ఉన్న ఆటగాళ్ల స్థానంలో యువ ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది

Tags :
|

Advertisement