Advertisement

  • 2003 ప్రపంచ కప్ టీంలోకి ఆ ముగ్గురిని తీసుకుంటా ..సౌరవ్ గంగూలీ

2003 ప్రపంచ కప్ టీంలోకి ఆ ముగ్గురిని తీసుకుంటా ..సౌరవ్ గంగూలీ

By: Sankar Sun, 05 July 2020 7:36 PM

2003  ప్రపంచ కప్ టీంలోకి ఆ ముగ్గురిని తీసుకుంటా ..సౌరవ్ గంగూలీ



క్రికెట్ లో ఇప్పటిదాకా జరిగిన ప్రపంచ కప్ లలో టీం ఇండియా రెండు సార్లు కప్ కైవసం చేసుకుంది ..ఇంకో రెండు సార్లు కప్ పక్క సాధిస్తుంది అని భావించి చివర్లో బోల్తా పడింది ..అవి 2003 సౌరవ్ గంగూలీ నాయకత్వంలో అయితే , ఇంకోసారి గత ఏడాది కోహ్లీ సారధ్యంలో ఇంకోసారి ..ఈ రెండు సార్లు ఇండియా తప్పక గెలుస్తాది అని భావించిన నిరాశే ఎదురు అయింది ..ఈ నేపథ్యంలో 2003, 2019లలోని భారత జట్ల బలాబలాలను చూస్తే దాదాపు ఒకేలా ఉంటాయి. రెండు జట్లలో బలమైన జట్టు ఏదంటే చెప్పడమూ కష్టమే.

ఇలాంటి పరిస్థితుల్లో 2003 భారత జట్టు సారథి గంగూలీకి ఓ విచిత్రమై ప్రశ్న ఎదురైంది. మయాంక్ అగర్వాల్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో గంగూలీకి ఈ ప్రశ్న ఎదురైంది. మయాంక్ మాట్లాడుతూ, 2019 జట్టు నుంచి ఎవరైనా ముగ్గురు ఆటగాళ్లను అప్పటి జట్టుకు ఎంపిక చేసుకోమని గంగూలీని కోరాడు. దీంతో డైలమాలో పడిన గంగూలీ చివరకు రోహిత్, కోహ్లీ, బూమ్రాలను ఎంపిక చేసుకున్నాడు.

నేను నా జట్టులో ఈ ముగ్గురినీ తీసుకునేందుకు ఇష్టపడతా. అయితే ఈ విషయం తెలిస్తే సెహ్వాగ్‌ రేపు నాకు ఫోన్ చేసి ‘ఏమనుకుంటున్నావు నువ్వు..?’ అని కోప్పడతాడేమో. నా ఎంపికలో రోహిత్ టాప్‌ఆర్డర్‌లో బ్యాటింగ్ వస్తాడు. నేను మూడో స్థానంలో బరిలోకి దిగుతా. కోహ్లీ మిడిల్ ఆర్డర్‌లో ఆడతాడు’ అంటూ గంగూలీ చెప్పుకొచ్చాడు. అయితే నాలుగో ఆప్షన్ కూడా ఇస్తే ధోనీని ఎంచుకుంటానని, అతడు కీపింగ్‌లో బెస్ట్ అని తెలిపాడు. అయితే మూడు ఆప్షన్స్ మాత్రమే ఉండడంతో ద్రావిడ్‌తో సరిపెట్టుకుంటానని, అతడు కూడా ఎంతో చక్కగా కీపింగ్ చేయగలడని గంగూలీ వివరించాడు.


Tags :
|
|
|

Advertisement