Advertisement

బిగ్ బాస్ డే 1 - అంత గంగవ్వ నామస్మరణం

By: Sankar Tue, 08 Sept 2020 2:13 PM

బిగ్ బాస్ డే 1 - అంత గంగవ్వ నామస్మరణం


బిగ్ బాస్ సీజన్ 4 హడావిడి మొదలయింది..తొలి రోజే గొడవలు , ఏడుపులతో ప్రారంభం అయింది..ఇక మొదటి వారం ఎలిమినేషన్ ఉండదని అందరూ అనుకున్నారు కానీ, నామినేషన్ ప్రక్రియ మొదటి రోజే పూర్తి చేశాడు బిగ్ బాస్. 14 మంది సభ్యులను ఇద్దరేసిగా కనెక్ట్ చేసి వారిలో ఒక్కోరిని నామినేట్ చేయమన్నాడు బిగ్ బాస్. అంటే 7 గురు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారన్న మాట.ఈ నామినేషన్ ప్రక్రియలో కల్యాణి..సుజాత ల మధ్య మాత్రం గట్టి ఫైట్ అయింది.

ఇక అంతా కలిసి గంగవ్వను టార్గెట్ చేశారు. గంగవ్వమీద ప్రేమ ఒలకబోస్తూనే ఆమెను నామినేట్ చేసారు. వీరిలో దేత్తడి హారిక తప్ప మిగిలిన వారందరు గంగవ్వను నామినేట్ చేసారు. గంగవ్వను నామినేట్ చేసి దానికి కారణం కూడా చెప్పుకొచ్చారు. బయట గంగవ్వ బయట నీకు మంచి ఫాలోయింగ్ ఉంది. మేము నిన్ను నామినేట్ చేసిన బయట జనాలు నిన్ను బయటకు వెళ్లనివ్వరు అంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా మొదటి వారమే గంగవ్వను డేంజర్ జోన్ లోకి నెట్టేసేరు..

ఇక మొదటి రోజే ఇంటీసభ్యులంతా ఏడుపులు , గొడవలు , గ్లామర్ షోలతో రచ్చ రచ్చ చేశారు. సీక్రెట్ రూమ్ లో ఉన్న ఇద్దరూ ఆరియానా గ్లోరీ, సోహిల్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.మొత్తానికి తొలి రోజు నుంచే బయట గంగవ్వకు ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది..మరి గంగవ్వ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి..

Tags :
|

Advertisement